Corona Virus: ఖైరతాబాద్ లో వృద్ధుడి మృతి నేపథ్యంలో... 200 మందికి కరోనా పరీక్షలు!

Officials Allert in Khairatabad over Corona Death
  • చనిపోయిన తరువాత వృద్ధుడికి కరోనా ఉన్నట్టు నిర్దారణ
  • ఖైరతాబాద్ లోని పలు ప్రాంతాలను జల్లెడ పడుతున్న పోలీసులు
  • సుమారు 2,500 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉండటంతో అప్రమత్తం
తెలంగాణలో కరోనా వ్యాధితో తొలి మృతి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రాంతంలో నమోదుకాగా, ఈ ప్రాంతాన్నంతా అధికారులు జల్లెడ పతుతున్నారు. ఓ వృద్ధుడు మరణించిన తరువాత అతని రక్త నమూనాల్లో కరోనా వైరస్ ఉన్నట్టు నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో వైద్యాధికారులు, శానిటేషన్‌ సిబ్బంది, ఇతర అధికారులతో అతను నివాసం ఉంటున్న ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌, ఇందిరానగర్‌ లో పర్యటించి, మృతుడి కుటుంబీకులు, వారు కలిసిన వారందరిలో సుమారు 200 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు.

ప్రజల్లో ఆందోళన పెరగకుండా చూసేందుకే ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ఎవరైనా ఇటీవలి కాలంలో విదేశాలకు వెళ్లి వచ్చినా, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లినా, వారి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు వెల్లడించారు. మొత్తం 10 జెట్‌ మిషన్లు, 18 ఏయిర్‌ టెక్‌ మిషన్ల సాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం సిటీలో దాదాపు 18 వేల మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారని, ఖైరతాబాద్‌ పరిధిలో 2500 మంది ఉన్నారని వెల్లడించారు. వీరందరినీ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌ లో ఉంచామని, దుకాణాదారులు తగు జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాలు చేసుకోవాలని తెలిపారు.
Corona Virus
Hyderabad
Khairatabad
Sanitation

More Telugu News