Bollywood: కరోనా సోకలేదు.. కాలు విరిగిందనే ఆసుపత్రికి: ట్వింకిల్ ఖన్నా

I dont have coronavirus and went for hospital for my broken leg says twinkle khanna
  • స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త అక్షయ్‌ 
  • వీడియోను పోస్ట్ చేసిన ట్వింకిల్
  • కాలు విరగడంతో కట్టు కట్టించుకున్నట్టు వెల్లడి
బాలీవుడ్ నటి, హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఆసుపత్రికి వెళ్లింది. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించగా.. అదివారం అక్షయ్‌ కుమార్ స్వయంగా కారు నడుపుతూ ఆమెను ముంబైలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని ట్వింకిల్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపింది. ముఖానికి మాస్క్ ధరించిన అక్షయ్ .. ముంబైలో ఖాళీ రోడ్లపై కారు నడుపుతున్న వీడియోను పోస్ట్ చేసింది. తాము ఆసుపత్రికి వెళ్లొస్తున్నామని చెప్పింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్పిటల్ అనగానే అందరూ ఆందోళన చెందడం సహజమని అభిప్రాయపడింది. అయితే, తనకు కరోనా వైరస్ లేదన్న ట్వింకిల్‌.. విరిగిన కాలుకు కట్టు కట్టించుకోవడం కోసం ఆసుపత్రికి వెళ్లినట్టు ఆ వీడియోలో చెప్పింది. ‘ఆసుపత్రి నుంచి మా ఇంటికి వెళ్తుండగా రోడ్లు ఎడారులను తలపిస్తున్నాయి. ఆసుపత్రి అనగానే ఎవరూ కంగారు పడొద్దు. నేను బకెట్ తన్నేస్తానని అనుకుంటున్నారేమో. నేనిప్పుడు ఏ బకెట్ తన్నలేను’ అని సరదాగా ట్వీట్ చేసింది.
Bollywood
akshay kumar
twinkle khanna
hospital

More Telugu News