‘నిజమైన ప్రపంచ హీరో’.. లాక్డౌన్లో డీఎస్పీగా సేవలందిస్తున్న జోగిందర్పై ఐసీసీ ప్రశంసలు
- 2007 టీ20 ప్రపంచకప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర
- ప్రస్తుతం హర్యానాలో డీఎస్పీగా సేవలు
- లాక్డౌన్ విధుల్లో జోగిందర్
ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. కోవిడ్-19ను నివారించేందుకు ప్రభుత్వం 21 రోజులపాటు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జోగిందర్ మళ్లీ మెరిశాడు. ప్రస్తుతం హర్యానాలో డీఎస్పీగా పనిచేస్తున్న జోగిందర్.. లాక్డౌన్ సందర్భంగా విధులు నిర్వర్తిస్తూ కనిపించాడు. ఈ ఫొటోను షేర్ చేసిన ఐసీసీ అతడిని ప్రశంసించింది. 2007లో ‘టీ20 ప్రపంచకప్ హీరో’.. 2020లో ‘నిజమైన ప్రపంచ హీరో’ అని కామెంట్ చేసింది. ఐసీసీ పోస్టు చేసిన కాసేపటికే ఈ ఫొటో వైరల్ అయింది. జోగిందర్పై అభిమానులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.