Corona Virus: బర్మింగ్ హామ్ నుంచి వచ్చిన వ్యక్తిని కలిశారు... ఏపీలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

AP witnesses two more corona positive cases
  • ఈ నెల 17న బర్మింగ్ హామ్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తి
  • ఏపీలో కొత్త కేసులు నమోదు
  • 21కి చేరిన కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య
ఏపీలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 17న బర్మింగ్ హామ్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కలవగా, ఇప్పుడా ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 21కి పెరిగింది. ప్రధానంగా ఇటలీ, ఇంగ్లాండ్, చైనా నుంచి వచ్చిన వ్యక్తులు, వారిని కలిసిన వ్యక్తులే కరోనా బారినపడినట్టు అధికారిక వివరాల ద్వారా అర్థమవుతోంది.
Corona Virus
Andhra Pradesh
Positive
UK
COVID-19

More Telugu News