Ram Nath Kovind: ‘కరోనా’ కట్టడికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విరాళం

President of India Ramnath kovind announces donation
  • పీఎం సహాయ నిధికి విరాళంగా ఒక నెల జీతం
  • ఈ మేరకు రామ్ నాథ్ కోవింద్ ప్రకటన
  • కోవింద్ నిర్ణయంపై ప్రధాని మోదీ కృతజ్ఞతలు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చేస్తున్న పోరాటానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన వంతు సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ‘కరోనా’ వ్యాప్తి నివారణ నిమిత్తం పీఎం సహాయ నిధికి తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ‘కరోనా’ మహమ్మారిపై పోరాడేందుకు భారత పౌరులందరూ పీఎం సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోవింద్ పిలుపు నిచ్చారు.ఇదిలా ఉండగా, కోవింద్ నిర్ణయంపై ప్రధాని మోదీ తన కృతజ్ఞతలు తెలిపారు.
Ram Nath Kovind
President Of India
Corona Virus
Donation

More Telugu News