Varla Ramaiah: సీఎం గారూ, ఆ విందులో పాల్గొన్న అందరికీ నిర్బంధ వైద్యం అందించేలా ఆదేశాలివ్వండి: వర్ల రామయ్య

Varla Ramaiah responds on latest issues
  • కరోనా పరిణామాలపై స్పందించిన వర్ల రామయ్య
  • ఎమ్మెల్యే కుటుంబానికి వైద్యం చేయించడం పట్ల అభినందనలు 
  • గుంటూరు కలెక్టర్ కు ఆదేశాలివ్వాలని సీఎంకు విజ్ఞప్తి
కరోనా కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందించారు. సీఎం గారూ, గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబానికి కాటూరి ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యం చేయించడం అభినందనీయం అని కొనియాడారు. ఆనాడు విందులో చాలామంది పెద్దలు పాల్గొన్నట్టు సమాచారం ఉందని, వారందరికీ నిర్బంధ వైద్యం చేయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సత్వర చర్యలకు గుంటూరు కలెక్టర్ కు ఆదేశాలివ్వాలని కోరారు.
Varla Ramaiah
Jagan
Corona Virus
Guntur
Mustafa
YSRCP

More Telugu News