బీహార్ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ స్పందన
- లాక్ డౌన్ తో బీహార్ వలస కూలీలు హైదరాబద్ లో ఉండిపోయారు
- వారికి ఇబ్బంది కలగకుండా చూడాలంటూ తేజ్ ప్రతాప్ వినతి
- మేము జాగ్రత్తగా చూసుకుంటామని బదులిచ్చిన కేటీఆర్
ఈ క్రమంలో బీహార్ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో పరిధిలోని వెంకటగిరిలో బీహార్ నుంచి వలస వచ్చిన 20 మంది కూలీలు చిక్కుకుపోయారని, వారికి ఆహారం అందేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆ కూలీల పేర్ల జాబితాను ఈ పోస్ట్ లో జతపరిచారు. ఈ పోస్ట్ పై కేటీఆర్ వెంటనే స్పందించారు. మేము జాగ్రత్తగా చూసుకుంటామని బదులిచ్చిన ఆయన, ఈ మేరకు తన కార్యాలయం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అదే విధంగా, మేడ్చల్ జిల్లాలోని పంచంపల్లిలో ఒడిశాకు చెందిన వలస కూలీలు కూడా లాక్ డౌన్ కారణంగా ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారని, దయచేసి వారికి సాయపడాలని ఓ ట్వీట్ ద్వారా కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై చర్యలు చేపట్టాల్సిందిగా మేడ్చల్ కలెక్టర్ కు సూచనలు చేశారు.
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 15 మంది గచ్చిబౌలిలో చిక్కుకుపోయారని, వారికి ఆహారం అందజేయాలని ఇంకో ట్వీట్ లో కేటీఆర్ ను కోరగా, వారిని తాము జాగ్రత్తగా చూసుకుంటామని బదులిచ్చారు.