Telivision: రెండు నెలలపాటు నాలుగు చానళ్లు ఉచితం: ఐబీఎఫ్

IBF announces four channels free for two months
  • సోనీపాల్, స్టార్ ఉత్సవ్, వయాకామ్ 18, కలర్స్ రిలేషన్‌షిప్ చానల్స్ ఫీ
  • డీటీహెచ్, కేబుల్ టీవీలకు వర్తింపు
  • టీవీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందన్న ఐబీఎఫ్
డీటీహెచ్, కేబుల్ నెట్‌వర్క్ వినియోగదారులకు ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబీఎఫ్) శుభవార్త చెప్పింది. సోనీపాల్, స్టార్ ఉత్సవ్, వయాకామ్ 18, కలర్స్ రిలేషన్‌షిప్ చానళ్ల అన్ని రుసుములను రెండు నెలలపాటు మాఫీ చేయాలని నిర్ణయించినట్టు ఐబీఎఫ్ తెలిపింది. ఈ చానళ్లు రెండు నెలలపాటు ఉచితంగా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. డీటీహెచ్, కేబుల్ నెట్‌వర్క్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. కాగా, కరోనా వైరస్ కారణంగా టీవీ పరిశ్రమ దారుణ పరిస్థితి ఎదుర్కొంటోందని, ప్రకటనల ఆదాయం గణనీయంగా పడిపోయిందని ఐబీఎఫ్ తెలిపింది.
Telivision
IBF
Corona Virus

More Telugu News