Spain: స్పెయిన్‌ను కబళిస్తున్న కరోనా.. మరణాల్లోనూ రికార్డులు బద్దలు!

Corona Death toll rises to 5690 in Spain
  • ఒక్క రోజులోనే 832 మంది మృతి
  • 5,690కి చేరుకున్న మరణాల సంఖ్య
  • ఇటలీలో నెమ్మదిస్తున్న పరిస్థితులు
స్పెయిన్‌లో కరోనా వైరస్ విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో ప్రాణాలు తీస్తూ విలయతాండవం చేస్తోంది. 24 గంటల్లోనే ఇక్కడ ఏకంగా 832 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక్కడ ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి.

శుక్రవారం ఇక్కడ ఒక్క రోజులోనే 769 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ తర్వాత 24 గంటల్లోనే అంతకుమించిన మరణాలు నమోదు కావడం గమనార్హం. తాజా మరణాలతో స్పెయిన్‌లో మృతి చెందినవారి సంఖ్య 5,690కి చేరుకుంది. అలాగే మొత్తం కేసుల సంఖ్య 72,248కి పెరగ్గా, 12,285 మంది కోలుకున్నారు. స్పెయిన్‌తో పోలిస్తే ఇటలీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ గురువారం- శుక్రవారం మధ్య 24 గంటల వ్యవధిలో ఏకంగా 969 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, శనివారం పరిస్థితి కొంత నెమ్మదించడం ఊరటనిచ్చే అంశం.
Spain
Corona Virus
Italy

More Telugu News