Pawan Kalyan: విరాళం ప్రకటించిన పవన్ ను అభినందించిన జనసేన నేతలు

Janasena leaders appreciates Pawan Kalyan for his donation against corona
  • కరోనాపై పోరుకు రూ.2 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్
  • పార్టీ నేతలతో పవన్ టెలీ కాన్ఫరెన్స్
  • జనసైనికులకు దిశానిర్దేశం చేసిన పవన్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కరోనాపై పోరాటానికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించడం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ ను జనసేన నేతలు అభినందించారు. పవన్ నిర్ణయం కరోనా నివారణ చర్యలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పవన్ ఇవాళ పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 కరోనా నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో నిరుపేదలు, రైతులు, కార్మికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పవన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు ఎలా ఖర్చవుతున్నాయో గమనించాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ ప్రధాన కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని తెలిపారు.
Pawan Kalyan
Janasena
Corona Virus
Donation
Andhra Pradesh

More Telugu News