Chiranjeevi: సినీ కార్మికుల కోసం చిరంజీవి నేతృత్వంలో చారిటీ ఏర్పాటు.. విరాళాలు ఇచ్చేవారు సంప్రందించాలని సూచన!

Chiranjeevi established charity committee for cine labour
  • కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సినీ కార్మికుల కోసం చిరంజీవి నిర్ణయం
  • కరోనా క్రైసిస్ చారిటీ కమిటీ ఏర్పాటు
  • చైర్మన్ గా చిరంజీవి, సభ్యులుగా సురేశ్ బాబు, తమ్మారెడ్డి, ఎన్.శంకర్
కరోనా ప్రళయం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ సినీ కార్మికుల సంక్షేమానికి ముందుకువచ్చారు. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) పేరిట ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సీసీసీ చైర్మన్ గా చిరంజీవి వ్యవహరించనుండగా, కమిటీ సభ్యులుగా డి.సురేశ్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్ వ్యవహరిస్తారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కార్మికుల కోసం విరాళాలు ఇచ్చే నటీనటులంతా సీసీసీని సంప్రదించాలని చిరంజీవి సూచించారు. ఇప్పటికే పలువురు అగ్రనటులు సినీ కార్మికుల కోసం భారీ ఎత్తున విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Chiranjeevi
Corona Crisis Charity
Tollywood
Cine Labour
Lockdown

More Telugu News