Mahesh Babu: టాలీవుడ్ సినీ కార్మికుల కోసం మహేశ్ బాబు రూ.25 లక్షల విరాళం

Tollywood star Mahesh Babu donates TFI
  • కరోనా లాక్ డౌన్ తో స్థంభించిన టాలీవుడ్
  • కార్మికుల పట్ల మహేశ్ బాబు సానుభూతి
  • ఇతర నటీనటులు కూడా విరాళాలు ప్రకటించాలని కోరిన మహేశ్ బాబు
కరోనా నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాంతో సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చలనచిత్ర ప్రముఖులు టాలీవుడ్ కార్మికుల కోసం భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా చేరారు.

సినీ కార్మికుల కోసం తాను రూ.25 లక్షలు ఇస్తున్నట్టు మహేశ్ ప్రకటించారు. "లాక్ డౌన్ పరిస్థితులు సినీ వర్కర్ల జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి. అందుకే కరోనా సంక్షోభంతో అల్లాడుతున్న చలనచిత్ర పరిశ్రమ కార్మికుల కోసం విరాళం అందిస్తున్నాను. ఇలాంటి కష్టకాలంలో ఇతర నటీనటులు అందరూ ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించాలని కోరుతున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
Mahesh Babu

More Telugu News