Nara Lokesh: కొరియాలాంటి దేశాల్లో ఈ చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారు: నారా లోకేశ్

lokesh fires on corona
  • అలవాటైన చేతిని ఎక్కువగా వాడొద్దు
  • మీది కుడిచేతి వాటం అయితే ఎడమచేతితో తలుపుతీయండి
  • ఎడమచేతి వాటం అయితే కుడిచేతితో తలుపులు తీయాలి
  • తద్వారా ఆ చేతితో ముఖాన్ని తాకడం తగ్గుతుంది 
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి టీడీపీ నేత నారా లోకేశ్ పలు చిట్కాలు చెప్పారు. 'కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలపట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారు. అందులో ప్రధానమైనది... అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోవడం' అని తెలిపారు.
 
'మీది కుడిచేతి వాటం అయితే ఎడమచేతితో, ఎడమచేతి వాటం అయితే కుడిచేతితో తలుపులు తియ్యడంలాంటి పనులు చెయ్యండి. తద్వారా ఆ చేతితో ముఖాన్ని తాకడం తగ్గుతుంది. ఈ చిన్న జాగ్రత్త కొంతవరకూ కరోనా బారిన పడకుండా ఆపుతుంది. ఇది కేవలం ఒక చిట్కా మాత్రమే. రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి' అని లోకేశ్ ట్వీట్లు చేశారు.
Nara Lokesh
Telugudesam
Corona Virus

More Telugu News