India: దేశంలో మరిన్ని పెరిగిన కరోనా కేసులు.. మరణాలు
- ఇప్పటివరకు 873 మందికి కరోనా పాజిటివ్
- కోలుకున్న 79 మంది
- 24 గంటల్లో కొత్తగా 149 మందికి కరోనా
- తెలంగాణలో 59 మందికి కరోనా
దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 873 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 79 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో 24 గంటల్లో కొత్తగా 149 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
ఇక దేశం మొత్తం మీద 19 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, కేరళలో కరోనా కేసుల సంఖ్య 176కు చేరింది. మహారాష్ట్రలో 162, కర్ణాటకలో 64, తెలంగాణలో 59 మందికి కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్‌లో 13 మంది కరోనా బాధితులున్నారు.