Chiranjeevi: చిరంజీవి, పూరి జగన్నాథ్ ల మధ్య ఆసక్తికర చర్చ

Funny discussion between Chiranjeevi and Puri Jagannadh
  • ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి
  • చిరును ఫాలో అవుతున్న లక్షలాది మంది అభిమానులు
  • స్వాగతం పలుకుతున్న సినీ ప్రముఖులు
ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా అభిమానులతో టచ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవికి సోషల్ మీడియాలో అపూర్వమైన స్పందన వచ్చింది. లక్షలాది మంది అభిమానులు చిరును ఫాలో అవుతున్నారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియాలోకి ఆహ్వానం పలికారు.

దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా చిరంజీవికి వెల్ కం చెప్పారు. 'సోషల్ మీడియాలోకి స్వాగతం సార్. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తున్న తరుణంలో సోషల్ మీడియా మనల్ని దగ్గర చేస్తుంది' అని ట్వీట్ చేశారు. పూరీ జగన్నాథ్ ట్వీట్ కు చిరంజీవి స్పందించారు.  'థాంక్యూ పూరీ జగన్నాథ్. కరోనా కారణంగా మంచి ఫ్యామిలీ టైమ్ లభిస్తోంది. ముంబై, బ్యాంకాక్ బీచ్ లను నీవు మిస్ అవుతావేమో కానీ... పవిత్ర, ఆకాశ్ నీతో సమయాన్ని గడపడాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు' అని రీట్వీట్ చేశారు. దీనిపై జగన్ స్పందిస్తూ 'లవ్ యూ అన్నయ్యా' అని ట్వీట్ చేశారు.
Chiranjeevi
Puri Jagannadh
Tollywood

More Telugu News