Andhra Pradesh: ఆరోగ్యంగా ఉన్న వారిని అనుమతించండి: ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు ఉత్తర్వులు

High Court orders on people who are returning back to AP
  • ఏపీ సరిహద్దుల్లో తెలంగాణ నుంచి వస్తున్న ప్రజలను అడ్డుకున్న పోలీసులు
  • రోడ్లపై నానా ఇబ్బందులు పడ్డ జనాలు
  • ఎన్ఓసీని ఎంట్రీ పాయింట్ లోనే పరిశీలించాలి
తెలంగాణ నుంచి ఏపీకి బయల్దేరిన విద్యార్థులు, ఐటీ ఉద్యోగులను సరిహద్దు వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ  ఇచ్చిన ఎన్ఓసీని ఎంట్రీ పాయింట్ లోనే పరిశీలించాలని ఆదేశించింది.

ఆరోగ్యపరంగా బాగున్నవారిని అనుమతించాలని చెప్పింది. ఆరోగ్యంగా లేనివారిని క్వారంటైన్ కు తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్వారంటైన్ అవసరం లేకపోతే  గృహనిర్బంధంలో ఉంచాలని... ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ ప్రజలను నిలిపివేయడంపై బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు... ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Andhra Pradesh
Corona Virus
Telangana
Boarder
Police
High Court

More Telugu News