Tollywood: ఒంటరిగా వచ్చి సూపర్ మార్కెట్లో సరుకులు కొన్న అల్లు అర్జున్!

Allu Arjun buys groceries at a supermarket like a commoner
  • నెట్‌లో వైరల్‌గా మారిన ఫొటో
  • ప్రస్తుతం సుకుమార్ చిత్రంలో నటిస్తున్న బన్నీ
  • కరోనా దెబ్బకు ఆగిపోయిన షూటింగ్
కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా  21 రోజుల లాక్‌డౌన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠంగా అమలు చేస్తున్నాయి. షాపింగ్ మాల్స్, జిమ్ములు, సినిమా థియేటర్లను మూసివేశాయి.  నిత్యావసర సరుకుల దుకాణాలు, మెడికల్ షాపులు, ఇతర అత్యవసర సేవలు అందించే వాటికే అనుమతి ఇచ్చాయి. నిర్ణీత సమయం తర్వాత ప్రజలు బయటికి రావడంపై ఆంక్షలు విధించాయి.

ఈ సమయంలో పలువురు సెలబ్రిటీలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. తమకు చాలా అరుదుగా లభించే విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. ఇంటి పని, వంట పని, తోట పని చేసుకుంటూ సేద తీరుతున్నారు.

ఇలాంటి టైమ్‌లో టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ సరుకులు కొనడానికి సూపర్ మార్కెట్‌కు వచ్చాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పసుపు రంగు షూ, టీ షర్ట్, నల్ల రంగు షార్ట్ ధరించిన అర్జున్ ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులతో జూబ్లీహిల్స్‌లోని ఓ సూపర్ మార్కెట్లో కనిపించాడు. సాధారణ  కస్టమర్ మాదిరిగా ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాడు. మాస్కు ఉండడంతో ఆ సూపర్ మార్కెట్లో అతడిని ఎవరూ గుర్తు పట్టినట్టు లేరు.

‘అల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక మంధాన హీరోయిన్ కాగా, తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే, కరోనా నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్‌కు బ్రేక్‌ పడింది.
Tollywood
hero
Allu Arjun
buys groceries
supermarket

More Telugu News