పరశురామ్ సినిమాలో కీర్తి సురేశ్!

Parashuram Movie
  • 'మహానటి'తో మంచి క్రేజ్ 
  • ఆమె నటనకి మహేశ్ ఫిదా 
  •  పరశురామ్ మూవీలో ఆమె పాత్రకి ప్రాధాన్యత
మహేశ్ బాబు తాజా చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి పరశురామ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. మహేశ్ బాబు జోడీగా కీర్తి సురేశ్ నటించనున్నట్టు ఒక వార్త వినిపిస్తోంది. దర్శకుడికి ఆమె పేరును సూచించింది మహేశ్ బాబేనట.

 'మహానటి' సినిమా చూసిన మహేశ్ బాబు .. కీర్తి సురేశ్ నటనకి ఫిదా అయ్యాడట. హావభావాలను ఆమె అద్భుతంగా పలికించిందనే విషయాన్ని సన్నిహితుల దగ్గర వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆ తరువాత ఆమె కాంబినేషన్లో చేయాలని మహేశ్ బాబు అనుకున్నప్పటికీ, కథానాయిక పాత్రలు ఆమెకి సెట్ అయ్యేవి కాదు. అందువలన మహేశ్ బాబు వేరే హీరోయిన్స్ తో చేస్తూ వెళ్లాడు. పరశురామ్ కథ చెప్పిన వెంటనే మాత్రం .. నాయిక పాత్రకి ప్రాధాన్యత ఉందని భావించిన మహేశ్ బాబు, ఆ పాత్రకి కీర్తి సురేశ్ అయితే బాగుంటుందని భావించి ఆమె పేరును సూచించాడట. అందువల్లనే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు.
Go Back to Shorts
Mahesh Babu
Keerthi Suresh
Parashuram Movie

More Telugu News