Prashanth Varma: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ సినిమా

Prashnth Varma Movie
  • 'అ' సినిమాతో మంచి పేరు 
  • 'కల్కి' సినిమాతో గుర్తింపు
  • తదుపరి సినిమాకి సన్నాహాలు
తెలుగులో కొత్తదనంతో కూడిన కథలను సిద్ధం చేసుకునే యువ దర్శకుల జాబితాలో ప్రశాంత్ వర్మ కూడా కనిపిస్తాడు. ఆయన నుంచి వచ్చిన 'అ' చిత్రం ప్రయోగాత్మకమేనని చెప్పాలి. ఇక భారీ చిత్రాలను కూడా ప్రశాంత్ వర్మ సమర్థవంతంగా తెరకెక్కించగలడనే నమ్మకాన్ని 'కల్కి' సినిమా కలిగించింది.

తాజాగా ఆయన ఒక కథపై కూర్చున్నాడని అంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఈ వైరస్ చాలా వేగంగా ప్రయాణిస్తోంది. ఈ వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంలో తలమునకలై వున్నాయి. అలాంటి ఈ వైరస్ ను నేపథ్యంగా తీసుకుని ప్రశాంత్ వర్మ ఒక కథను సిద్ధం చేస్తున్నాడట. ఓ అప్ కమింగ్ హీరోతో ఆయన ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Prashanth Varma
Corona Viras Movie
Tollywood

More Telugu News