రాత్రి పూట కర్ఫ్యూను పొడిగించే యోచనలో కేసీఆర్!
- వాస్తవానికి 31 వరకూ రాత్రిపూట కర్ఫ్యూ
- ఏప్రిల్ 14 వరకూ అమలుకానున్న లాక్ డౌన్
- అంతవరకూ కర్ఫ్యూ విధించే ఆలోచన
- ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణయం
నిత్యావసరాల గురించే ప్రజలు అధికంగా బయటకు వస్తున్నారని అధికారులు సీఎంకు తెలుపగా, ప్రజలు తిరుగుతూ ఉంటే కరోనాను ఆపలేమని, లాక్ డౌన్, కర్ఫ్యూలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించిన కేసీఆర్, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరింత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.
పేదలకు హామీ ఇచ్చిన విధంగా రూ. 1,500 నగదు బదిలీ ప్రక్రియను ప్రారంభించాలని, పేదలకు రేషన్ బియ్యాన్ని సైతం సాధ్యమైనంత త్వరగా అందించాలని కేసీఆర్ ఆదేశించారు.