Kanna Lakshminarayana: ‘గరీబ్ కల్యాణ్’ ప్యాకేజ్ ప్రకటనపై కన్నా హర్షం

AP BJP president Kanna express glad on Garid Kalyan package
  • దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ తో నిరుపేదలకు ఆర్థిక ఇబ్బందులు
  • వారిని ఆదుకునేందుకు ‘గరీబ్ కల్యాణ్’ ప్రకటించడంపై  సంతోషం
  • మోదీకి, నిర్మలా సీతారామన్ కు నా ధన్యవాదాలు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ తో ఏరోజుకారోజు సంపాదించుకునే వారు, ఉపాధి కూలీలు, రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ‘గరీబ్ కల్యాణ్’ ప్యాకేజ్ ప్రకటించడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ హర్షం వ్యక్తం చేశారు. రూ. 1.70 లక్షల కోట్ల ‘గరీబ్ కల్యాణ్’ ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీకి, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో దాదాపు 80 కోట్ల మందికి సహాయం అందుతుందని చెబుతూ కన్నా ఓ ట్వీట్ చేశారు.
Kanna Lakshminarayana
BJP
Garibkalyan
Narendra Modi
Nirmala Sitharaman

More Telugu News