Chiranjeevi: మహేశ్‌, ఎన్టీఆర్‌, కాజల్‌, తమన్నాలకు చిరు కృతజ్ఞతలు.. ప్రశంసలు!

chiranjeevi about corona
  • అమ్మడు కాజల్‌కి థ్యాంక్యూ
  • ఎన్టీఆర్, చెర్రీ కరోనా అవగాహన వీడియో బాగుంది
  • మహేశ్‌ 6 గోల్డెన్‌ రూల్స్‌పై అందరూ పాటించాలి
కరోనాపై అవగాహన కల్పిస్తోన్న పలువురు సినీనటులను మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసించారు. అలాగే, తాను ట్విట్టర్‌లో అడుగుపెట్టినందుకు కొందరు చేసిన ట్వీట్‌లను ఆయన రీట్వీట్ చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. 'థ్యాంక్యూ అమ్మడు.. జనతా కర్ఫ్యూ రోజున మీ వీడియోను చూశాను. ఆరోగ్యకర ఆహారం, ఫిట్‌నెస్‌, మెడిటేషన్‌పై అవగాహన కల్పించారు. 21 రోజుల ఈ లాక్‌డౌన్‌ సమయంలోనూ విలువైన ఐడియాలు ఇవ్వాల్సి ఉంది.. ఇస్తూనే ఉండు' అని హీరోయిన్‌ కాజల్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

'థ్యాంక్యూ లక్ష్మి.. సైరాలో దేశ భక్తిని ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్య వంతులను చేస్తూ నటించిన మీ తీరు నాకు నచ్చింది. అలాగే, ఈ 21 రోజులు ఆరోగ్యకరమైన అలవాట్లపై ప్రజలను చైతన్యవంతులను చేస్తారని ఆశిస్తున్నాను' అని తమన్నాను ఉద్దేశించి చిరు ట్వీట్ చేశారు.

'మై డియర్‌ తారక్‌.. మీరు, రామ్ చరణ్‌ కలిసి కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ వీడియో చేశారు. మీ ప్రయత్నాలను ప్రశంసిస్తున్నాను' అని జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. మహేశ్‌ బాబు చెప్పిన 6 గోల్డెన్‌ రూల్స్‌ ను ప్రజలు ఫాలో కావాలని చిరు పేర్కొన్నారు. రాజమౌళి, నాగార్జున, సుహాసిని, నితిన్‌, నిఖిల్‌ను ఉద్దేశించి కూడా చిరంజీవి ట్వీట్లు చేస్తూ వారిని ప్రశంసించారు.
Chiranjeevi
Tollywood
Mahesh Babu

More Telugu News