India: 21 రోజులు...రూ.9 లక్షల కోట్లు: లాక్‌డౌన్‌తో ఆర్థిక రంగానికి నష్టంపై లెక్క ఇది!

9 lakh crores loss to Indian Economy due to lockdown
  • జీడీపీలో నాలుగు శాతం ఆవిరి
  • ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలపై ప్రభావం
  • సమయం పెరిగితే మరింత పెరిగే అవకాశం
ఆరోగ్యమా...ఆర్థిక సమస్యా అంటే కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యానికే పెద్దపీట వేసింది. కానీ కరోనా కట్టడికోసం ప్రభుత్వం ప్రకటించిన మూడు వారాల లాక్‌డౌన్‌ వల్ల మన ఆర్థిక రంగానికి జరిగే నష్టం ఎంతో తెలుసా? అక్షరాలా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు (120 బిలియన్‌ డాలర్లు). అంటే మన జీడీపీలో నాలుగు శాతం అన్నమాట.

ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలపైనా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వృద్ధిరేటు కూడా 3.5 శాతం నుంచి 1.7 శాతానికి పడిపోనుందని భావిస్తున్నారు. అదికూడా లాక్‌డౌన్‌ ఈ 21 రోజులతో ముగిస్తే పర్వాలేదు, లేదంటే మరింత ప్రభావం ఉంటుందని అంచనా.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నష్టపోయిన రంగాలకు భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. వచ్చేనెల 4వ తేదీన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విధాన సమీక్ష నివేదికను వెల్లడించనుంది. ఈ సందర్భంగా ప్యాకేజీ అంశం ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
India
Economy
lockdown
GDP

More Telugu News