Prabhas: ప్రభాస్ .. మహేశ్ లను లైన్లో పెట్టే పనిలో సురేందర్ రెడ్డి

Surendar Reddy Movie
  • భారీ చిత్రాల దర్శకుడిగా సురేందర్ రెడ్డి 
  • ఆల్రెడీ కథ వినేసిన అల్లు అర్జున్ 
  • ప్రభాస్ పైనే ఎక్కువ దృష్టి పెట్టిన సురేందర్ రెడ్డి
సురేందర్ రెడ్డి పేరు వినగానే 'రేసు గుర్రం' .. 'కిక్' .. 'ధ్రువ' .. 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలు గుర్తొస్తాయి. సురేందర్ రెడ్డి భారీ చారిత్రక చిత్రాలను సైతం సమర్థవంతంగా తెరకెక్కించగలడు అనే విషయాన్ని 'సైరా' నిరూపించింది. ఆ తరువాత ఏ హీరోతో వీలైతే ఆ హీరోతో సెట్స్ పైకి వెళ్లే ఉద్దేశంతో ఆయన అల్లు అర్జున్ .. మహేశ్ బాబు .. ప్రభాస్ కోసం కథలను రెడీ చేసుకుని రంగంలోకి దిగాడు.

 ఇప్పటికే అల్లు అర్జున్ కి ఆయన కథ వినిపించడం జరిగిపోయిందని అంటున్నారు. 'రేసు గుర్రం' వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కావడం వలన, అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మహేశ్ బాబు .. ప్రభాస్ లను కూడా ఆయన కలవనున్నట్టు సమాచారం. గతంలో ఆయన మహేశ్ తో 'అతిథి' చేశాడు. కనుక, ప్రభాస్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా చెబుతున్నారు. ప్రభాస్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ పట్ల అభిమానులు కూడా ఆసక్తితో వున్నారు.
Prabhas
Mahesh Babu
Allu Arjun
Surendar Reddy

More Telugu News