RRR: 'రౌద్రం రణం రుధిరం' అర్థం చెప్పిన వీవీ వినాయక్!

RRR Meaning by VV Vinayak
  • ప్రేక్షకుల్లో సస్పెన్స్ కు తెరదించిన రాజమౌళి
  • టైటిల్ పై ఎంతో మంది పాజిటివ్ కామెంట్లు
  • వైరల్ అవుతున్న వీవీ వినాయక్ పోస్ట్
ఎంతో కాలంగా టాలీవుడ్ సినీ ప్రేక్షకుల్లో ఉన్న సస్పెన్స్ కు తెరదించుతూ శార్వరీ నామ సంవత్సర ప్రారంభం నాడు, 'ఆర్ఆర్ఆర్' అబ్రివేషన్ ను రివీల్ చేస్తూ, రాజమౌళి టైటిల్ ను ప్రకటించిన తరువాత, ఎంతో మంది తమతమ శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ మోషన్ పోస్టర్ నెట్టింట వైరల్ అయింది. తాజాగా దర్శకుడు వీవీ వినాయక్ దీనిపై స్పందించారు. టైటిల్ లోని రౌద్రం, రణం, రుధిరం అంటే ఏంటో విశ్లేషించారు.

బ్రిటీష్ ప్రభుత్వ పాలనపై కట్టలు తెంచుకున్నదే 'రౌద్రం' అని, ఆ ఇద్దరూ కలిసి చేయాలనుకున్నది 'రణం' అని, ఆ యుద్ధంలో వాళ్లు అర్పించినది 'రుధిరం' అని ఆయన కామెంట్ చేశారు. వినాయక్ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, "ఒత్తిడిని పెంచే వార్తలు విరామం లేకుండా ఒకదాని తరువాత ఒకటి వినాల్సి వస్తున్న ఈ సమయంలో, రాబోయే మంచి విషయాల కోసం ఎదురుచూడాలని గుర్తు చేసిన రాజమౌళికి ధన్యవాదాలు. కొవిడ్-19 వంటి భయంకర వార్తలతో పాటు ఆర్ఆర్ఆర్ వంటి గొప్ప విషయాలు కూడా ఉన్నాయి" అని అన్నారు.
RRR
Ranam Roudram Rudhiram
VV Vinayak

More Telugu News