Allu Arjun: ఈ సారి రూట్ మార్చిన సుకుమార్

Sukumar Movie
  • బన్నీ కథానాయకుడిగా సుకుమార్ మూవీ 
  • యాక్షన్ .. ఎమోషన్లకు పెద్దపీట 
  • మాస్ లుక్ తో కనిపించనున్న బన్నీ   
తెలుగులోని అగ్రదర్శకుల జాబితాలో సుకుమార్ ఒకరుగా కనిపిస్తాడు. కథాకథనాలను సిద్ధం చేసుకోవడంలో సుకుమార్ సిద్ధహస్తుడు. అందువలన ఆయన సినిమాల్లో కంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన 'వన్ నేనొక్కడినే' .. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో రివేంజ్ ఫార్ములాలో సాగాయి. ప్రస్తుతం బన్నీ కథానాయకుడిగా ఆయన రూపొందిస్తున్న సినిమా కూడా ఇదే తరహా కథతో రూపొందుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

కానీ ఈ సారి ఆయన ఎంచుకున్నది రివేంజ్ ఫార్ములా కాదట. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ప్రధానంగా ఈ కథ నడుస్తుందని సమాచారం. సుకుమార్ తన సినిమాల్లో కథానాయకులను డిఫరెంట్ లుక్ తో చూపించడం ఆయనకి అలవాటు. అలాగే ఈ సినిమాలోనూ బన్నీని ఆయన మాస్ లుక్ తో చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీ జోడీగా ఆయన రష్మికను ఎంపిక చేసుకున్నాడు.
Allu Arjun
Rashmika Mandanna
Sukumar Movie

More Telugu News