RRR: 'రౌద్రం రణం రుధిరం' సినిమాపై చిరంజీవి ఏమన్నారంటే..!

Megastar Chiranjeevi Comment on RRR tittle
  • నిన్న విడుదల అయిన టైటిల్
  • ఒళ్లు గగుర్పొడిచేలా వుంది
  • చరణ్, తారక్ పనితీరు అద్భుతమని కితాబు
ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా పలువురు ప్రముఖ తారలతో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి 'రౌద్రం రణం రుధిరం' అనే టైటిల్‌ ను ఖ‌రారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ లను నిన్న విడుదల చేయగా, మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో స్పందించారు.

"మోషన్ పోస్టర్ కనువిందుగా ఉంది. నా ఒళ్లు గ‌గుర్పొడిచింది. కీర‌వాణి అద్భుత‌మైన సంగీతాన్ని, నేప‌థ్య సంగీతాన్ని అందించారు. రాజ‌మౌళి, చ‌ర‌ణ్‌, తార‌క్ ప‌నితీరు అద్భుతంగా ఉంది. ఈ ఉగాది రోజున అంద‌రిలో ఎన‌ర్జీని నింపారు" అని కామెంట్ పెట్టారు. దీనికి రాజమౌళి సమాధానం ఇస్తూ, "సర్.. మీరు ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఉగాది శుభాకాంక్ష‌లు. ట్విట్ట‌ర్‌ కు స్వాగ‌తం" అని ట్వీట్ పెట్టారు.
RRR
Roudram Ranam Rudhiram
Chiranjeevi
Rajamouli
Junior NTR
Ramcharan

More Telugu News