iran: ఇరాన్‌ నుంచి భారత్‌ చేరుకున్న 277 మంది

277 evacuees from Iran arrived at Jodhpur Airport
  • రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ విమానాశ్రయంలో పరీక్షలు
  • అక్కడి నుంచి జోధ్‌పూర్‌ మిలిటరీ స్టేషన్‌ వద్దకు తరలింపు
  • అక్కడి శిబిరంలో ఉంచనున్న అధికారులు  
కరోనా వైరస్‌ అధికంగా ఉన్న ఇరాన్‌ నుంచి 277 మంది భారతీయులు ఈ రోజు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే నిబంధనల ప్రకారం వారిని పరీక్షించిన అధికారులు.. అక్కడి నుంచి వారిని జోధ్‌పూర్‌ మిలిటరీ స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు.

వారందరికీ అన్ని సదుపాయాలు కల్పించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కావలసినంత మంది వైద్య సిబ్బందిని పంపింది. 277 మందిలో 149 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం వారంతా టెహ్రాన్‌ నుంచి మొదట ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని అక్కడి నుంచి జోధ్‌పూర్‌కు తీసుకొచ్చారని అధికారులు వివరించారు.  
iran
India
Corona Virus

More Telugu News