Vijay Sai Reddy: కరోనా మిగతా వ్యాధుల్లాంటిది కాదు: విజయసాయిరెడ్డి

vijaya sai reddy on corona
  • ముందస్తు లక్షణాలు కనిపించకుండా వ్యాప్తి
  • ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా సమాజానికి నష్టం 
  • 21 రోజుల లాక్ డౌన్ ను అంతా మనస్ఫూర్తిగా పాటించాలి
  • ఇదొక అవిశ్రాంత పోరాటం 
కరోనాపై పోరాటంలో ప్రజలందరూ సహకరించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు. 'కరోనా మిగతా వ్యాధుల్లాంటిది కాదు. ముందస్తు లక్షణాలు కనిపించకుండానే ఒకరి నుంచి అనేక మందికి వ్యాపిస్తుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా సమాజానికి, కుటుంబానికి నష్టం చేసినవారమవుతాం. 21 రోజుల లాక్ డౌన్ ను అంతా మనస్ఫూర్తిగా పాటించాలి. ఇదొక అవిశ్రాంత పోరాటం' అని ట్వీట్ చేశారు.
 
'తెలుగు ప్రజందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు. కరోనా విపత్తుపై ప్రజాయుద్ధం కొనసాగుతున్న ఈ తరుణంలో మనవంతు కర్తవ్యం నిర్వర్తించాలి. గడప దాటకుండా ఈ మహమ్మారిని అంతం చేద్దాం. కరోనాపై పోరులో ప్రభుత్వానికి సహకరిద్దాం' అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
Vijay Sai Reddy
YSRCP
Corona Virus

More Telugu News