Chiranjeevi: మొట్టమొదటి ట్వీట్ చేసిన చిరంజీవి.. స్పందించిన టాలీవుడ్‌ అగ్ర హీరోలు

chiranjeevi first tweet
  • 'చిరంజీవి కొణిదెల' అనే పేరుతో ట్విట్టర్‌ ఖాతా ఓపెన్
  • అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన చిరు
  • కరోనాపై జాగ్రత్తలు తెలిపిన మెగాస్టార్
  • చిరుకి స్వాగతమన్న టాలీవుడ్‌ హీరోలు 
ఉగాది శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌ ఖాతా ప్రారంభించారు. ఆయన రెండు ట్వీట్లు చేశారు. ఇప్పటికే ఆయన ఇన్ స్టాగ్రామ్ లోనూ ఖాతా తెరిచిన విషయం తెలిసిందే.  'చిరంజీవి కొణిదెల' అనే పేరుతో ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను ప్రారంభించారు. 'అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు' అని పేర్కొంటూ కరోనా విజృంభణపై జాగ్రత్తలు తెలుపుతూ చిరు తొలి ట్వీట్ చేశారు.

కాగా, చిరు చేసిన తొలి ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ పలువురు హీరోలు ఆయనకు సామాజిక మాధ్యమాల్లోకి స్వాగతం పలికారు. చిరుకి స్వాగతమని, ఆయన చెప్పే మాటలు ఈ విపత్కర పరిస్థితుల్లో చాలా మందికి మార్గదర్శకాలుగా నిలుస్తాయని అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. చాలా మంది టాలీవుడ్‌ హీరోలు చిరు ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు.

Chiranjeevi
Tollywood
Twitter
Instagram

More Telugu News