గ్లామర్ పాత్రలకి నో చెబుతున్న అనుపమ!
- వరుస హిట్లు కొట్టిన అనుపమ
- యూత్ లో ఆమెకి మంచి క్రేజ్
- ఇటీవల కొన్ని ఆఫర్లు వదిలేసిన అనుపమ
యువ కథానాయికలతో పోటీపడే అర్హతలు పుష్కలంగా వున్న అనుపమ వెనకబడిపోవడానికి కారణం, గ్లామరస్ గా కనిపించే పాత్రలను ఆమె అంగీకరించకపోవడమేనని అంటున్నారు. అనుపమకు ఆ మధ్య కొన్ని అవకాశాలు వెళ్లాయట. అయితే గ్లామర్ షో చేయడానికి ఆమె నిరాకరించడంతోనే ఆ అవకాశాలు జారిపోయాయని అంటున్నారు. అయితే అనుమప పద్ధతిగా కనిపిస్తేనే బాగుంటుందనేది ఆమె అభిమానుల మాట కూడా.