Corona Virus: కరోనా బారినపడిన తండ్రిని దూరం నుంచి చూస్తూ పాట పాడిన కుమార్తె... కన్నీరు పెట్టిస్తున్న వీడియో!

Opera Singer Irit Stark Song for Father
  • ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా
  • వ్యాధి బారినపడిన ఇరిట్ స్టార్క్ తండ్రి మైఖేల్
  • బాల్కనీలో ఉన్న తండ్రిని చూస్తూ ఓదార్పు పాట పాడిన ఇరిట్
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బారిన పడి విలవిల్లాడుతున్న ఎన్నో దేశాల్లో ఇజ్రాయిల్ కూడా ఉంది. ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్‌ లో ఓ ఘటనకు సంబంధించిన వీడియో, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయి, చూపరులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. కరోనా వ్యాధి బారినపడిన తండ్రిని దూరం నుంచి చూస్తూ, ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఓ కూతురు పాట పాడింది.

ఒపెరా గాయనిగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఇరిట్ స్టార్క్ తండ్రి మైఖేల్ స్టార్క్‌ కు కరోనా పాజిటివ్ అని తేలగా, ఆయన ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అపార్టుమెంట్ బాల్కనీలో నిలబడివున్న తండ్రిని చూస్తూ, ఆయనకు వినిపించేలా పాట పాడుతూ ఇరిట్ ఓదార్పు ఇచ్చే ప్రయత్నం చేసింది. కూతురి పాట విన్న మైఖేల్, తనలోని బాధను మరచి, చిరునవ్వుతో చప్పట్లు కొట్టారు. ఈ ఘటనను చూసిన స్థానికులు కన్నీళ్లు పెట్టుకోగా, ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంది.
Corona Virus
Irit Stark
Song
Viral Videos

More Telugu News