Narendra Modi: ఈ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్: ప్రధాని మోదీ

PM Modi announces lock down in country
  • దేశంలో పెరుగుతున్న కరోనా మహమ్మారి తీవ్రత
  • 21 రోజుల పాటు దేశంలో లాక్ డౌన్ అమలు
  • ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రధాని స్పష్టీకరణ
కరోనా మహమ్మారిపై పోరాటం నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ లాక్ డౌన్ 21 రోజుల పాటు కొనసాగుతోందని తెలిపారు. లాక్ డౌన్ ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని అన్నారు. ఇది ఒక రకంగా కర్ఫ్యూ వంటిదని, ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పరిధిలోకి వస్తాయని, ప్రతి నగరం, ప్రతి పట్టణం, ప్రతి గ్రామం, ప్రతి వీధి లాక్ డౌన్ తప్పదని తెలిపారు.
 
Narendra Modi
Lockdown
India
Corona Virus

More Telugu News