446కి పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే 99 కొత్త కేసులు: కేంద్ర ప్రభుత్వం ప్రకటన

  • భారత్ లో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి
  • ముంబైలో మూడుకు చేరిన మృతుల సంఖ్య
  • నిన్న సాయంత్రం ప్రాణాలు కోల్పోయిన 65 ఏళ్ల వ్యక్తి
భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈరోజుకు దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 446కి చేరుకున్నాయి. నిన్న ఒక్క రోజే 99 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 9 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. ముంబై నగరంలో ముగ్గురు మరణించారు. నిన్న సాయంత్రం 65 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. ఈయన  ఈనెల  15న యూఏఈ నుంచి అహ్మదాబాద్ వచ్చారు. మార్చి 20న అక్కడి నుంచి ముంబైకి వచ్చారు. కరోనా లక్షణాలతో ఉన్న ఆయనను కస్తూర్బా ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న సాయంత్రం చనిపోయారు.

Corona Virus
Death Toll
India

More Telugu News