Corona Virus: ఈ తల్లి సెంటిమెంట్ ను కాపాడదాం... పదండి: నరేంద్ర మోదీ

Modi Appeles to people to keep inside
  • స్టీల్ ప్లేట్ తో మద్దతు పలికిన వృద్ధురాలు
  • వీడియో చూసి స్పందించిన ప్రధాని
  • ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని వినతి
నిలువ నీడ లేని ఓ వృద్ధ మహిళ వీడియోను ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. ఎంతో ప్రమాదకరమైన కరోనా వైరస్ తో జాతి యావత్తూ పోరాడుతున్న వేళ, "ఈ తల్లి సెంటిమెంట్ ను కాపాడదాం పదండి. ఇంట్లోనే ఉందాం. ఈమె ఇస్తున్న మెసేజ్ ఇదే" అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో, ఓ ప్లాస్టిక్ పైకప్పుతో ఉన్న చిన్న గుడిసె ముందు కూర్చున్న ఓ వృద్ధురాలు, తన చేతిలోని పళ్లెంతో, శబ్దం చేస్తూ కనిపిస్తోంది. జనతా కర్ఫూ విజయవంతమైన రోజున, సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

ఇక ఈ వృద్ధురాలు హైదరాబాద్ కు చెందిన మహిళ కాగా, ఈ వీడియోను తొలిసారిగా పోస్ట్ చేసిన పార్దు అనే యువకుడు, ఆమెను  ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. పలువురు తమతమ బాల్కనీల ముందు నిలబడి, చప్పట్ల మోత మోగిస్తున్న వేళ, ఈమె తనకు చేతనైన రీతిలో జనతా కర్ఫ్యూకు మద్దతు పలికిందని వ్యాఖ్యానించారు.
Corona Virus
Janata Curfew
Narendra Modi
Twitter

More Telugu News