kannada producer: కన్నడ సినీ నిర్మాత కపాలి మోహన్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో బాధలు ఏకరువు!

Kannada producer and businessman kapali mohan suicide
  • గత రాత్రి హోటల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య
  • కుమార్తె పెళ్లిని ఘనంగా చేసిన మోహన్
  • ఆత్మహత్యకు పురికొల్పిన ఆర్థిక కష్టాలు
బెంగళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, ఫైనాన్షియర్ అయిన మోహన్‌ అలియాస్‌ కపాలి మోహన్‌(58) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. కన్నడ పరిశ్రమతో మంచి సంబంధాలున్న ఆయన ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది. గంగమ్మగుడి పోలీస్ స్టేషన్ పరిధిలోని బసవేశ్వర కేఎస్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో గత రాత్రి మోహన్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

స్నేహితుడితో కలిసి భోజనం చేసిన ఆయన అర్ధరాత్రి తర్వాత కుమారుడికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించారు. బసవేశ్వర కేఎస్ ఆర్టీసీ బస్టాండు వద్ద సింగిల్ బిడ్ టెండరు తీసుకుని కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టానని, దీనివల్ల దారుణంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి అద్దె చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నానని పేర్కొన్నారు.

 బ్యాంకులు తన ఆస్తుల్ని జప్తు చేశాయని, అన్నింటినీ కోల్పోయానని, పూర్తిగా ఓడిపోయానని కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తనకు న్యాయం చేస్తారని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల రాజప్రస్థానం మైదానంలో మోహన్ తన కుమార్తె వివాహాన్ని వైభవంగా నిర్వహించారు. రాజకీయ, సినీ ప్రముఖులు వివాహానికి హాజరయ్యారు. 2018లో సీసీబీ, 2019లో ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. మోహన్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
kannada producer
kapali mohan
suicide
Bengaluru

More Telugu News