America: అమెరికాను అల్లాడిస్తున్న కరోనా వైరస్.. ఒక్క రోజులోనే 10 వేల కేసులు

America shut down New York amid Coronavirus fears
  • నిన్న ఒక్క రోజే 140 మంది మృతి
  • పలు నగరాల షట్‌డౌన్
  • తాజాగా న్యూయార్క్ మూసివేత
అమెరికాలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తోంది. చైనాలో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్ ఇప్పుడు అక్కడ కనుమరుగవుతుండగా ప్రపంచ దేశాలను, ముఖ్యంగా ఐరోపా దేశాలను కలవరపెడుతోంది. ఇక, అమెరికాలోనూ ఈ వైరస్ తన ప్రతాపం చూపుతోంది. అక్కడ నిన్న ఒక్క రోజే ఏకంగా 140 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా, 10,168 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 43,734కు పెరిగింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు నగరాలను షట్‌డౌన్ చేసిన అమెరికా.. నిన్న న్యూయార్క్‌ను మూసివేసింది. ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 15 వేలు దాటింది.
America
Corona Virus
corona deaths
newyork
shutdown

More Telugu News