Visakhapatnam: ఇంగ్లాండ్ నుంచి వచ్చిన విశాఖ యువకుడికి కరోనా పాజిటివ్

Visakha youth came from England tested corona positive
  • ఏపీలో మరో కరోనా కేసు
  • రాష్ట్రంలో ఏడుకు చేరిన కరోనా బాధితుల సంఖ్య
  • దేశంలో 10కి చేరిన మరణాలు
  • హిమాచల్ ప్రదేశ్ లో వృద్ధుడి మృతి
ఏపీలో మరో కరోనా కేసు నమోదైంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన 25 ఏళ్ల విశాఖ యువకుడికి కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య ఏడుకు చేరింది. అటు, దేశంలో కరోనా మరణాల సంఖ్య 10కి చేరింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో 69 ఏళ్ల వృద్ధుడు కరోనా మహమ్మారికి బలయ్యాడు. ఆ వృద్ధుడు మార్చి 15న అమెరికా నుంచి భారత్ వచ్చినట్టు గుర్తించారు. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 439కి చేరింది.
Visakhapatnam
England
Corona Virus
Positive

More Telugu News