Anushka Shetty: అప్పుడు డ్యాన్స్ చేయలేక ఏడ్చేశాను!: హీరోయిన్ అనుష్క

anushka about her first movie
  • సూపర్ సినిమాలో డ్యాన్స్‌ కోసం రిహార్సల్స్‌ చేశా
  • డ్యాన్స్‌ చేయలేకపోయా
  • నా 15 ఏళ్ల కెరీర్‌ పూర్తయింది 
  • ఇలాంటి సమయంలో కోడి రామకృష్ణ లేకపోవడం బాధాకరం
దక్షిణాదిన అగ్ర హీరోయిన్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క తాను నటించిన తొలి చిత్రం 'సూపర్‌'ను గుర్తు చేసుకుంది. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా తాను పడ్డ ఇబ్బందులు తెలిపింది. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... 'సూపర్‌' లో ఓ పాటకు రిహార్సల్స్‌ చేస్తున్నప్పుడు డ్యాన్స్‌ ఎలా చేయాలో తెలిసేది కాదని, తాను చేయలేనని ఏడ్చానని చెప్పింది. దీంతో పది రోజులైనా టైమ్‌ తీసుకుని రిహార్సల్స్‌ చేయాలని కొందరు చెప్పారని తెలిపింది.

వచ్చినప్పుడే చేద్దామని వారు తనకు ధైర్యం చెప్పారని అనుష్క వివరించింది. ఆ సినిమా యూనిట్‌ మొత్తం తనను ఎంతో ప్రేమగా చూసుకునేదని తెలిపింది. తన 15 ఏళ్ల కెరీర్‌ పూర్తయిందని, ఇలాంటి సమయంలో కోడి రామకృష్ణ లేకపోవడం బాధాకరమని, ఆయన ఎక్కడున్నా తమతోనే ఉంటారని బాధతో చెప్పింది. కాగా, ఆయన దర్శకత్వంలో అనుష్క నటించిన 'అరుంధతి' సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
Anushka Shetty
Tollywood

More Telugu News