Anasuya: కేటీఆర్ కు యాంకర్ అనసూయ రిక్వెస్ట్!

Anasuya request to KTR
  • లాక్ డౌన్ లో కొన్ని వృత్తులకు సడలింపులు ఉండాలి
  • ఇంటి అద్దె, బిల్లులు, ఈఎంఐలు మేము చెల్లించాలి
  • పనికి వెళ్లకపోతే.. మాకు ఆదాయం రాదు
కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు రాష్ట్రంలో మార్చి 31 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కు సినీ నటి, ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ ఓ విన్నపం చేశారు.

'సార్... ప్రభుత్వం చెప్పింది పాటించాలి. కానీ, కొన్ని ప్రొఫెషన్స్ విషయంలో మాత్రం కొన్న సడలింపులు ఉండాలి. మేము పనికి వెళ్లకపోతే... మాకు ఆదాయం రాదు. ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు, ఈఎంఐలు మొదలైన వాటిని చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మాలాంటి వారి ఇబ్బందులను కూడా పట్టించుకోండి' అని ట్వీట్ చేశారు.
Anasuya
Tollywood
KTR
TRS
Lockdown

More Telugu News