Guntur District: టాలీవుడ్ సహాయ నటుడికి కరోనా పాజిటివ్.. పోలీసులకు సమాచారం అందించిన కుటుంబ సభ్యులు

Tollywood support actor who came from Bangkok tested corona positive
  • బ్యాంకాక్ నుంచి పది రోజుల క్రితం హైదరాబాద్‌కు
  • పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో పిడుగు రాళ్లకు
  • గుంటూరు ఆసుపత్రికి తరలింపు
టాలీవుడ్‌ సహాయ నటుడు కరోనా బారిన పడ్డాడు. బ్యాంకాక్ నుంచి పది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన బాధితుడు శనివారం రాత్రి పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైలులో హైదరాబాద్ నుంచి స్వగ్రామం అయిన పిడుగురాళ్లకు చేరుకున్నాడు. అయితే, అప్పటికే జలుబు, జ్వరంతో అతడు బాధపడుతున్నట్టు అతడి తల్లి తెలిపారు.

తాజాగా అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అయినప్పటికీ వైద్యం చేయించుకునేందుకు అతడు నిరాకరించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారి ఇంటికి చేరుకున్న పోలీసులు, మునిసిపల్ సిబ్బంది అతడికి అవగాహన కల్పించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులను కూడా పరీక్షించిన వైద్యులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.
Guntur District
Piduguralla
Corona Virus
Tollywood
support actor

More Telugu News