Pune police: బయటకొచ్చిన వారితో గుంజీలు తీయించిన పూణె పోలీసులు.. వీడియో వైరల్

Pune police make men do situps for violating Janata Curfew
  • ఖాళీ రోడ్లను చూసి ఆగలేకపోయిన పూణె యువకులు
  • బైకులతో రోడ్లపైకి..
  • పువ్వులిచ్చి పంపిన హైదరాబాద్ పోలీసులు
ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు నిన్న దేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటించింది. అందరూ ఇళ్లకే పరిమితమై ప్రధాని పిలుపును తు.చ. తప్పకుండా పాటించారు. అయితే, పూణెలోని కొందరు యువకులు మాత్రం ఖాళీ రోడ్లను చూసి ఆగలేకపోయారు. బైకులేసుకుని జాలీగా తిరిగేందుకు బయలుదేరారు.

పూణె పోలీసులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. జనతా కర్ఫ్యూను పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారిని పట్టుకుని గుంజీలు తీయించారు. మరోసారి బయటకు వస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించి పంపారు. యువకులతో గుంజీలు తీయిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోపక్క, హైదరాబాద్‌ పోలీసులు అయితే ఇలాంటి వారికి గులాబీ పూలు ఇచ్చి ఇంటికి పంపారు.


Pune police
Janata Curfew
Sit ups

More Telugu News