Kanika Kapoor: మమ్మల్ని చాలా నీచంగా చూస్తున్నారు: వాపోతున్న కనికా కపూర్ ఫ్యామిలీ!

Kanika Kapoor Family fires on Health Officials
  • మెడికల్ రిపోర్టు బయటకు పంపారు
  • సమాజంలో పలు అవమానాలను ఎదుర్కొంటున్నాం
  • మీడియాతో కనిక బంధువులు
లండన్ నుంచి వచ్చి, కరోనా వైరస్ బారిన పడ్డ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కుటుంబీకులు వైద్య శాఖ అధికారులు తమను నీచంగా చూశారని సంచలన ఆరోపణలు చేశారు. కనిక వయసు 41 సంవత్సరాలు కాగా, మెడికల్ రిపోర్టులో 28 అని రాశారని, ఆమెను పురుషునిగా పేర్కొన్నారని ఆరోపించారు.

అసలు కనిక వైద్య పరీక్షల రిపోర్టు మీడియా ముందుకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వైరస్ బారిన పడిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతూ, కనిక వివరాలు ఎందుకు బహిర్గతం చేశారని మండిపడ్డారు. ఇప్పటికే తాము సమాజంలో పలు అవమానాలకు గురవుతున్నామని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

కాగా, కనికా కపూర్ ఇచ్చిన పార్టీకి పలువురు సెలబ్రిటీలు, ఎంపీలు హాజరైన సంగతి తెలిసిందే. వీరంతా ఇప్పుడు సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లారు. ఆమెతో టచ్‌ లో ఉన్న 53 మంది అనుమానితులలో 11 మందికి నెగిటివ్ రిపోర్టు రాగా, మిగిలినవారి రిపోర్టులు రావాల్సి వుంది.  
Kanika Kapoor
Corona Virus
Medicle Report

More Telugu News