Krishnamraju: మా అబ్బాయి ప్రభాస్, మా అమ్మాయి సాయి ప్రసీద సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు: కృష్ణంరాజు

Krishnamraju tells about Prabhas self quarantine
  • వారిద్దరూ అధికారులకు సమాచారం అందించారని వెల్లడి
  • విదేశాల నుంచి వచ్చినవాళ్లు స్వచ్ఛందంగా క్వారంటైన్ లోకి వెళ్లాలని సూచన
  • ఇటీవలే జార్జియా నుంచి వచ్చిన ప్రభాస్
  • అమెరికా నుంచి వచ్చిన కృష్ణంరాజు పెద్ద కుమార్తె సాయిప్రసీద
తమ పిల్లలు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని సీనియర్ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు వెల్లడించారు. "మా అబ్బాయి ప్రభాస్, మా అమ్మాయి సాయి ప్రసీద సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. వారిద్దరూ విదేశాల నుంచి వచ్చిన వెంటనే అధికారులకు సమాచారం అందజేసి స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు తమకు ఎలాంటి అస్వస్థత లేకపోయినా ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి. అది వారి కనీస బాధ్యత" అని పేర్కొన్నారు. సాయి ప్రసీద కృష్ణంరాజు పెద్ద కుమార్తె. ఆమె ఇటీవలే అమెరికా నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్ తన కొత్త చిత్రం కోసం జార్జియాలో షూటింగ్ జరుపుకుని వచ్చారు.
Krishnamraju
Prabhas
Sai Prasida
Corona Virus
USA
Georgia

More Telugu News