Parvathipuram Police: అల్లు అర్జున్ పాటతో కరోనా ప్రచారం చేస్తున్న పార్వతీపురం పోలీసులు

Parvathi Puram Police makes tik tok video on corona
  • రాములో రాములా పాటకు పోలీసుల స్టెప్పులు
  • కరోనా నివారణ చర్యలపై ప్రజలను చైతన్యపరుస్తున్న పోలీసులు
  • వైరల్ అవుతున్న వీడియో
కరోనా భూతాన్ని తరిమికొట్టే క్రమంలో పార్వతీపురం పోలీసులు వినూత్న ప్రచారం చేపట్టారు. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రంలోని రాములో రాములా పాటకు స్టెప్పులేస్తూ కరోనాపై చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కరచాలనం వద్దు నమస్కారమే ముద్దు, చేతులు శుభ్రంగా కడుక్కోండి అనే సందేశాన్నిస్తూ హావభావాలతో పార్వతీపురం పోలీసులు కరోనా ప్రచారాన్ని రక్తి కట్టించారు. ముఖాలకు మాస్కులు ధరించి వారు చేసిన డ్యాన్సులు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ టిక్ టాక్ వీడియో వైరల్ అవుతోంది.
Parvathipuram Police
Corona Virus
Awareness
Allu Arjun
Ala Vaikunthapuramulo
Ramulo Ramula
Tik Tok

More Telugu News