Corona Virus: దేశంలో నిన్న ఒక్క రోజే 60 కరోనా పాజిటివ్‌ కేసులు: కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

coronavirus cases in india
  • మహారాష్ట్రలో మొత్తం కేసులు 74
  • కేరళలో 52, ఢిల్లీలో 27
  • ఉత్తరప్రదేశ్‌లో 25, రాజస్థాన్‌లో 24
  • తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్‌లో 5 
దేశంలో నిన్న ఒక్క రోజులో 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 24 మంది బాధితులు కోలుకున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో కొత్తగా 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా సోకిన 324 మందిలో 41 మంది విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో 74, కేరళలో 52, ఢిల్లీలో 27, ఉత్తరప్రదేశ్‌లో 25, రాజస్థాన్‌లో 24, తెలంగాణలో 21, హర్యానాలో 17 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 20, పంజాబ్‌లో 13, తమిళనాడులో 6 కరోనా కేసులు నమోదయ్యాయి.

చండీగఢ్‌లో 5, మధ్యప్రదేశ్‌లో 4, జమ్మూకశ్మీర్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 4 మంది కరోనా బాధితులున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 5, ఉత్తరాఖండ్‌లో 3, ఒడిశాలో 2, హిమాచల్‌ ప్రదేశ్‌లో 2 కేసులు ఉన్నాయి. అసోంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది.
Corona Virus
India

More Telugu News