Narendra Modi: ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి: ప్రధాని మోదీ

modi on corona
  • ఈ కర్ఫ్యూను పాటిద్దాం
  • కొవిడ్‌-19పై చేస్తోన్న పోరాటంలో మరింత శక్తిని అందిస్తుంది
  • ఈ చర్యలే రాబోయే రోజుల్లో మనకు సాయం చేస్తాయి
కరోనా విజృంభణ నేపథ్యంలో దేశమంతా 'జనతా కర్ఫ్యూ' పాటిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పందించారు. 'ఈ కర్ఫ్యూను పాటిద్దాం.. కొవిడ్‌-19పై చేస్తోన్న పోరాటంలో ఈ కర్ఫ్యూ మరింత శక్తిని అందిస్తుంది. మనం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలే రాబోయే రోజుల్లో మనకు సాయం చేస్తాయి. ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి.. కరోనాపై పోరాటం' అని మోదీ ట్వీట్లు చేశారు.

తమ గానం ద్వారా కరోనాపై అవగాహన కల్పిస్తోన్న వారి వీడియోలను పోస్ట్ చేసిన మోదీ వారిని అభినందించారు. కరోనాపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశమంతా  'జనతా కర్ఫ్యూ' కొనసాగుతోంది. 
Narendra Modi
BJP
Corona Virus
Janata Curfew

More Telugu News