Kanika Kapoor: కనికా కపూర్ సాధారణ రోగిలా ప్రవర్తిస్తే బెటర్: ఆసుపత్రి డైరెక్టర్

Kanika Kapoorrefuses to cooperate with doctors
  • ఎస్‌జీపీఐలో చేరిన కనికా కపూర్
  • ఫైవ్‌స్టార్ సదుపాయాలు కావాలంటోందన్న వైద్యులు
  • వైద్యులపై కనిక తీవ్ర ఆరోపణలు
కరోనా వైరస్‌తో బాధపడుతూ లక్నోలోని సంజయ్‌గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జీపీజీఐ)లో చేరి చికిత్స పొందుతున్న బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ తమకు ఏమాత్రం సహకరించడం లేదని ఆసుపత్రి డైరెక్టర్ ఆర్‌కే ధిమాన్ తెలిపారు. ఆమె ఒక రోగిలా ప్రవర్తించడం లేదని, ఫైవ్‌స్టార్ సదుపాయాలు కావాలంటోందని ఆరోపించారు. అమెకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రత్యేక గది, అటాచ్‌డ్ టాయిలెట్, టీవీ, వెంటిలేటర్ సౌకర్యాలు కల్పించినట్టు చెప్పారు. అలాగే, ఆసుపత్రి కిచెన్ నుంచి గ్లూటెన్ ఫ్రీ డైట్ అందిస్తున్నట్టు తెలిపారు.

అంతకుముందు కనికా కపూర్ వైద్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు సరైన చికిత్స అందించడం లేదని, గది మురికిగా ఉందని, దోమలు కుట్టి చంపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు రెండు చిన్న అరటిపండ్లు, బత్తాయి ఇచ్చారని, వాటిపైనా ఈగలు ముసురుకున్నాయని ఆరోపించింది.
Kanika Kapoor
Bollywood
SGPGI
Corona Virus

More Telugu News