Trivikram Srinivas: పుకార్లను నేను పెద్దగా పట్టించుకోను: సంగీత దర్శకుడు తమన్

Ala vaikunthapuramulo Movie
  • 'సామజ వర గమన' పాట సూపర్ హిట్ 
  • కొంతమంది కావాలని అలా ప్రచారం చేశారు 
  •  సాంగ్ కి వచ్చిన రెస్పాన్సే వాళ్లకి సరైన సమాధానం    
తెలుగులో సంగీత దర్శకుడిగా తమన్ కి మంచి క్రేజ్ వుంది. దేవిశ్రీ ప్రసాద్ తో పోటీపడుతూ ఆయన దూసుకుపోతున్నాడు. ఇటీవల 'అల వైకుంఠపురములో' సినిమాకి ఆయన అందించిన బాణీలు జనంలోకి బాగా వెళ్లాయి. ముఖ్యంగా 'సామజ వర గమన' అనే పాట సోషల్ మీడియాలో రికార్డుస్థాయి వ్యూస్ ను దక్కించుకుంది.

అయితే ఈ పాట బయటికి వచ్చినప్పుడే ఈ ట్యూన్ కాపీ అనే ప్రచారం జరిగింది. తాజా ఇంటర్వ్యూలో తమన్ ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ, "సామజ వర గమన పాట అంత బాగా రావడం వెనుక టీమ్ కృషి వుంది. ఇది కాపీ ట్యూన్ అని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేశారు. అలాంటివాళ్లకి చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే కాపీ ట్యూన్ ను ఈ స్థాయిలో ఎవరూ రిసీవ్ చేసుకోరు. ఈ ట్యూన్ కి వచ్చిన రెస్పాన్స్ నే, ఇలాంటి ప్రచారం చేసేవారికి సమాధానమని అనుకోవచ్చు" అని చెప్పుకొచ్చాడు.
Trivikram Srinivas
Allu Arjun
Thaman

More Telugu News