Gopichand: గోపీచంద్ ను కొత్తగా చూపించనున్న తేజ

Teja Movie
  • 'జయం'లో విలన్ గా గోపీచంద్ పరిచయం 
  • 'నిజం'లోను పవర్ఫుల్ విలన్ 
  • తేజ దర్శకత్వంలో తొలిసారి హీరోగా
ప్రస్తుతం గోపీచంద్ .. సంపత్ నంది దర్శకత్వంలో ఒక  సినిమా చేస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో యాక్షన్ ప్రధానంగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. ఈ సినిమా తరువాత దర్శకుడు తేజతో కలిసి గోపీచంద్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం.

'జయం' సినిమాతో ప్రతినాయకుడిగా గోపీచంద్ ను తెలుగు తెరకి పరిచయం చేసిందే తేజ. 'నిజం' సినిమాతో గోపీచంద్ లోని ప్రతినాయకుడిని పూర్తిస్థాయిలో ఆయన ఆవిష్కరించాడు.  అలాంటి గోపీచంద్ హీరోగా ఎదిగాక ఆయనతో కలిసి తేజ చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగానే కనిపించనున్నాడు. విలన్ గా గోపీచంద్ ను ఒక రేంజ్ లో చూపించిన తేజ, హీరోగా ఆయనను పవర్ఫుల్ పాత్రలో .. డిఫరెంట్ లుక్ తో చూపించనున్నట్టు చెబుతున్నారు.
Gopichand
Sampath Nandi
Teja Movie

More Telugu News